సంధ్యవేళ చిన్నినావా
సంధ్యవేళ చిన్నినావా ఒంటరాయెను చేరదీసే తోడులేక సొమ్మసిల్లెను -2 నిను చూడ మనసాయే - విధి నాతోరాదాయె నను చేర దిగిరావా - నను నీతో కొనిపోవా -2 యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా 1. హోరుగాలి పోరు నన్ను - కృంగదీసేనే చెప్పలేని మూగవేదన - గుండె నిండెనే నన్నెరిగినవాడవని - నా తోడై వస్తావని నన్నెన్నడు విడువవవని - నీవైపే చూస్తున్నా 2. అమ్మకన్న కమ్మనైన - ప్రేమయే నీవు నాన్నకన్న మిన్నయైన - ధైర్యమే నీవు నా ఆశయం నీవు - నా ఆశ్రయం నీవు నా శిల్పివి నీవు - నా శిఖరమే నీవు


Follow Us





