కృపకు ఆధారమా
కృపకు ఆధారమా... నడిపించే దైవమా నీ కృప నను విడువక అనుక్షణము కాచెను కృపకు ఆధారమా... నడిపించే దైవమా నీ కృప నను విడువక అనుక్షణము కాచెను ఏమి లేని నన్నెలా కనుగొన్నావు నీకేమి కాని నన్నెలా ప్రేమించావు నీవే దిక్కుగా నీవే దిశగా నీ దరి చేరగా నా దశ మార్చితివి ఎవ్వరు చేయని త్యాగము చేసితివే ఎవ్వరు విడదీయని బంధానివైతివే నీకే ఆరాధన స్తుతి ఆరాధన... నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీ మందిరములో దినము గడుపుటయే వేయి దినముల ఆశీర్వాదమే కన్నీటితో నీ సన్నిధి చేరగా ఘనులకు లేని ఘనతను ఇచ్చితివి ఎవ్వరు ఎవ్వని స్థానమునిచ్చితివే ఎవ్వరు తీసివేయని భాగ్యమునిచ్చితివే నీకే ఆరాధన స్తుతి ఆరాధన... నీకే ఆరాధన స్తుతి ఆరాధన నిర్మల హృదయుడా నిరంతర స్తోత్రార్హుడా మా ప్రాణములను సేదదీర్చితివి ప్రతి ఉదయమున కృపతో నింపుచు ప్రతికూలతలను అనుకూలపరచితివి ఎవ్వరు చేరని తేజో నివాసివి ఎవరున్నా లేకున్నా ప్రతిక్షణము నాకున్నావు నీకే ఆరాధన స్తుతి ఆరాధన... నీకే ఆరాధన స్తుతి ఆరాధన


Follow Us






