బహు గొప్పదయ్యా నీ కనికరం
బహు గొప్పదయ్యా నీ కనికరం నాపై ఉదయించె నిరంతరం బలపరచెనయ్యా నీ మాటలే కృంగిన ప్రతి వేళలో విడువక నన్ను ప్రేమించగా మదిలో నిండెను నీ రూపమే మానక నా యెడల కృప చూపగా పొంగెను నాలో ఓ వెల్లువ కృపయే కదా ఇది కృపయే కదా కృపయేనయ్య ఇది కృపయేనయ్య ॥2॥ 1. నా శక్తి కాదయ్య నీ కృపయేనయ్య నను నిలిపినది నేటి వరకు కరుణించినావయ్య హెచ్చించినావయ్య శత్రువులెదుటే దీవించినావయ్య ॥2॥ నీవే లేని నేను లేనే లేను యేసయ్య నీ కృప లేని నా బ్రతుకే ఊహకు కూడా అందదయ్య ఊహకు కూడా అందదయ్య ॥కృపయే॥ 2. గుండె పగిలి ఏడ్చితిని నిరాశలో నిలిచితిని నా కన్న తండ్రి వై నను హత్తుకొంటివి నా బలహీనతలో నాతోనున్నావే నీ కృప నాకు చాలునన్నావే ॥2॥ నాతో ఎవరు లేకున్నా నీ వుంటే నాకు చాలునయ్య సర్వం నేను కొల్పోయినా సమకూర్చెదవు నీ మహిమలో సమకూర్చెదవు నీ మహిమలో ॥కృపయే॥ 3. నమ్మదగిన వారెవరూ ప్రేమించేవారెవరూ ఒంటరైన వేళలో నిలిచింది ఎవ్వరూ? నిలువెల్ల విషమేగా మాటలేమో ప్రేమగా ఇహలోక బంధాలన్ని మాలిన్యమేగా ॥2॥ ఈ భీకరమైన లోకంలో నా చేయి విడువను అన్నావే… శిధిలము కాని రాజ్యముకై శిల్పకారుడా నను చెక్కితివే శిల్పకారుడా నను చెక్కితివే ॥కృపయే॥


Follow Us






