స్తుతి కీర్తనీయుడా
స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా యేసు రాజా అనురాగ బంధమా నను విడువలేని ఆత్మానుబంధమా నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును ఇలలోన నీకై సాక్షిగా జీవింతును నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిను వెంబడించగా ఈ జీవ వాక్యం నింపెనే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం మహిమ సింహాసనం నే చేరాలనే నే కన్న కలలన్నీ నిజమైన వేళలో నా జయము నీవై నిలిచిన శ్రేష్ట తరుణాన నీలోనే లీనమైపోదునే నే నిరతము


Follow Us






