LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఇదిగో నా జీవితం


ఇదిగో నా జీవితం దేవా నీకంకితం 
బ్రతుకైనా చావైనా నీకోసమే 
నాకున్నది నీవొక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా
ఆరాధింతును నా పూర్ణ హృదయముతో 
నిన్ను ఘనపరతును నా జీవితాంతము 
యేసయ్య... యేసయ్య... 

నీ వైపే చూడక నీ ప్రేమే నేనెరుగక 
సిధిలమైన శిలనై నేనుండగా 
నన్ను ప్రేమించగా వెంటాడితివి 
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి 
ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు 
ఎందుకని ఇంత ప్రేమించితివి 

దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము 
పరిమళించు పద్మము నీవేనయ్యా
ఊహల రేఖలకు ఊపిరి పోసితివి 
ఊహకు మించిన స్థానమునిచ్చితివి 
ఏమి చూచితివి యోగ్యత నాలో 
ఏమిచ్చి నీ ఋణమునే తీర్చెదను 

స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధతలో మహనీయుడా 
స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును 
సద్గుణములకు నిలయము నీవే 
సర్వాధిపతులకు సారధి నీవే 
దైవములనబడిన వారికి నీవే 
దేవుడవు మహా దేవుడవు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words