అబ్రహాము నమ్మిన దేవుడా
అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా ప్రభాకరుడా బహు బలవంతుడా సత్యవంతుడా మహా పరిశుద్ధుడా ఆరాధనకు యోగ్యుడా నీలి మేఘమును నీడగా మార్చి అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి సైన్యములకు నీవే సారధిగా నిలిచి నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన మా పక్షమై ఉన్న మహారాజువు నీవే నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించెదవు విస్తారమైన నీ కృపతో నింపి నిస్సారమైన బ్రతుకును మార్చెదవు విజయోత్సవముతో ఊరేగించెదవు నీకు సాధ్యము కానిది ఏదైనా గలదా సాత్వికముతో దీర్ఘ శాంతముతో విసుగక నా యెడల వాత్సల్యము చూపి ఒంటరిగా నను ఎన్నడు విడువక వేదనలో నను దాటి వెళ్ళక తల్లి వలె ఒడిలో లాలించువాడవు తీరని నీ ఋణము వివరింపతరమా


Follow Us






