మహాఘనుడా యెహోవా
మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా ప్రభు ప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు మహిమాత్ముడా నిత్యత్వమై జీవించువాడవు కీర్తించి మహిమ పరతును స్తుతించి ఆరాధింతును నీకే నా ఆరాధన హల్లెలూయ ఎలోహిం నీవే ఎల్ షద్దాయ్ దేవుడవు ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా నీవేగా అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా నీవేగా విధినే ఛేదించి నీవు భువినే వెలిగించగా స్తుతినే నా నోట పలికించి బహుగా జీవించగా గలమెత్తి కీర్తింతును కొండైన లోయైన సమభూమి చేసేది నీవేగా నీవేగా ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీ వాక్యమేగా శ్రమలే నను వేధించినను కలతలే బాధించిన కృపయే క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని నిరీక్షించి కీర్తింతును ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా నీవేగా నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా నా దేవా భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు నీవే సమాధాన ప్రభువై ఏలే మహారాజువు నీ కీర్తి కీర్తింతును


Follow Us






