సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను విశ్వాస యాత్ర కడగండ్ల పాలైనను కన్నీటి కడలి చెలరేగి పొంగినను నీవే నిమ్మలపరచినావు మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా మరి శ్రేష్టమైన ఈవులను నన్ను దయచేయ నీ కరుణ చూపి నా కొసగినావు సమృద్ధి జీవము నా కొరకే తెచ్చితివి సమీపించలేని నీ మహిమకై పిలిచిన మహిమోన్నతుడా యేసయ్యా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా త్వరలో రానైయున్న నా ప్రియుడవు కనురెప్పపాటున నిన్ను చేరెదను కనులారా నిన్ను చూసి మైమరచిపోయే కనువిందు చేసే మహిమానగరిలో పరవశమే ప్రతి నిత్యము మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా


Follow Us






