నా జీవిత పయనంలో
నా జీవిత పయనంలో నీ కృపయే నాకు ఆశ్రయము నీ కృపయే నను నడిపించుచున్నది నీ కృపయే నన్ను బలపరుచుచున్నది మెస్సియ్య నీకృపయే నీ కృపయే నాజీవితం 1. మహోన్నతమైనది శాశ్వత నీకృప మధురమైనది మరపురాని నీకృప విడువక ఎడబాయనిది నీకృప మరువక వెంబడించుచున్నది నీ కృప || మెస్సియ్య నీకృపయే || 2. మనసులో కలతలు నిండిన వేళలో ఆత్మబంధువై నాధరి చేరావు వాక్యముతో ఓదార్చినది నీకృప నీ సన్నిధిలో స్థిరపరచినది నీ కృప || మెస్సియ్య నీకృపయే || 3. నా ప్రతికొరతలు నీవు చూసినావు ఆశ్చర్యకార్యాలు నీవు తెరిచావు సమృద్ధితో పోషించినది నీ కృప వధువు సంఘములో నిలిపినది నీ కృప || మెస్సియ్య నీకృపయే ||


Follow Us






