న్యాయాధిపతియైన యేసయ్యా
న్యాయాధిపతియైన యేసయ్యా
న్యాయము తీర్చగా రావయ్యా
న్యాయము లేక దీనులు ఎందరో నలుగుచుండగా
న్యాయము లేక ఆత్మీయు లెందరో నశించుచుండగా
రావయ్యా ఆత్మల రక్షణకై
రావయ్యా ఆత్మ పాలనకై
లోకమంతా నాశనపుత్రుని ఒడిలో ఉండగా
నావారంతా గ్రహించలేక నశించుచుండగా
పంపయ్యా పౌలువలె వేదనతో
నింపయ్యా ఆత్మల భారముతో
సంఘముపైనా సాతానెంతో ప్రభలుచుండగా
ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచగా
లేపయ్యా రోషముకలిగిన దావీదులా
నిలుపయ్యా పోరాడిగెలిచిన యాకోబులా
పరిశుద్ధతలో సంపూర్ణతకు ఎదుగుచుండగా
కారు మేఘము కమ్మినట్లుగా చీకటి కమ్మగా
చూపయ్యా నీ దివ్యకాంతిని నా పైనా
నిలుపయ్యా చీకటిమధ్యలో జ్యోతిలా


Follow Us






