శుభమంటు ఎరుగని లోకాన
శుభమంటు ఎరుగని లోకాన - ప్రతి రోజూ పండగల మార్చావు
యాత్రికుడనై నిన్ను గూర్చి నే పాడేదన్
నీ కట్టడలే కారణం - నీ మాటల్లోనే ఉందిలే మధురం
సంబరమే యేసుతో జీవితం మధురమే నా రాజుతో జీవితం
లోకమంతయు నాదనుకొని సృష్టిని వెదకితిని - ప్రీతికరమైన నిన్నొదులుకొని నేను తిరిగితినీ
పడద్రోయక కట్టితివి - పెళ్లగింపక నాటితివి
తోటలో నన్నుంచి - వృదికై నన్నెంచి
యజమానుడా నను ఓర్చుకొంటివి
సంబరమే యేసుతో జీవితం - మధురమే నా రాజుతో జీవితం
ఉపకారం చేయుట నీ వల్లేనని తెలిసిన వదిలితిని - అపాయమే చేయని నా మంచి రాజుని వదులుకొని తిరిగితిని
అయిన నా యెడ కృపచూపితివి - కనికరముతో నన్నుండనిచ్చితివీ
తోటలో నన్నుంచి వృధికై నన్నెంచి
సరిపోయినవాడా నను చేర్చుకొంటివి
సంబరమే యేసుతో జీవితం మధురమే రాజుతో జీవితం


Follow Us






